HomeTelugu Trending'ధమాకా' మూవీ అప్డేట్‌

‘ధమాకా’ మూవీ అప్డేట్‌

 

Ravi Teja Dhamaka update

మాస్‌ మహారాజు ర‌వితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధ‌మాకా’. త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల‌లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే మూవీ నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మేక‌ర్స్ మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని విడుదల చేశారు.

‘ధ‌మాకా’ మూవీ రొమాంటిక్ గ్లింప్స్‌ను బుధ‌వారం సాయంత్రం 5.01 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌వితేజ‌కు జోడీగా పెళ్ళి సంద‌డి ఫేం శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ప్ర‌సన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu