HomeTelugu Trendingత్వరలో ముగ్గురు కాబోతున్నాం: విరాట్‌ కోహ్లీ

త్వరలో ముగ్గురు కాబోతున్నాం: విరాట్‌ కోహ్లీ

Kohli confirms anushka is pభారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలను అందించాడు. కోహ్లీకి పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతలు అప్పగించాక.. టీం ఇండియాను తిరుగులేని శక్తిగా నిలిపాడు. అయితే కోహ్లీ తాజాగా ఆయన అభిమానుల‌కు శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నానని ట్విట్టర్ లో తెలిపాడు. “ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం. జనవరి 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్నాడు” అని ట్విట్ట‌ర్ ద్వారా కోహ్లీ తెలిపాడు.

ఈ విష‌యం ప్ర‌క‌టించిన వెంట‌నే అభిమానులు, సెల‌బ్రిటీలు ఈ దంప‌తుల‌కి శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్ళాడు. అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వివాహం 2017 లో జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu