HomeTelugu Trendingసీటీమార్‌ నుండి ‘కబడ్డీ ఆంథమ్‌’ సాంగ్‌ విడుదల

సీటీమార్‌ నుండి ‘కబడ్డీ ఆంథమ్‌’ సాంగ్‌ విడుదల

Kabaddi anthem lyrical song

టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ‘కబడ్డీ ఆంథమ్‌’ పేరుతో స్ఫూర్తి రగిలించే పాటను విడుదల చేశారు. మణిశర్మ స్వరాలకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్‌, రమ్య బెహర, సాహితి చాగంటిలు ఆలపించారు. ఆద్యంతం అలరించేలా, ఉత్సాహం నింపేలా ఈ పాట సాగింది.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది. క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం ఎలా ఉండాలో, అదే స్థాయిలో ఉంటుందీ చిత్రం. గోపీచంద్‌ ఆంధ్ర కబడ్డీ జట్టుకి కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకి కోచ్‌గా కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి, పాటలకి మంచి స్పందన లభించింది. మాస్‌ అంశాల్ని పక్కాగా మేళవించి, ప్రతి సన్నివేశాన్నీ ప్రత్యేక హంగులతో తెరకెక్కించాం. కచ్చితంగా మా చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. దిగంగన సూర్యవంశీ, భూమిక, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, రెహమాన్‌, తరుణ్‌ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అప్సర రాణి ప్రత్యేక గీతం చేసింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu