HomeTelugu Big Storiesడిస్కోరాజా ఫస్ట్‌ లుక్‌ చూశారా?

డిస్కోరాజా ఫస్ట్‌ లుక్‌ చూశారా?

2 1
వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్నారు. రేపటి నుంచి గోవాలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్లూరి మాట్లాడుతూ ఈరోజు విడుదలచేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ రవితేజ ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉందని భావిస్తున్నా. ఈ లుక్ కి వంద రెట్లు కిక్ ఇచ్చేలా ఫుల్ మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ గా డిస్కోరాజాని రెడీ చేస్తున్నారు మా దర్శకుడు వి ఐ ఆనంద్. ఇక మా బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, వివిధ లొకేషన్స్ లో చేశాం. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అన్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేస్తున్నాం. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయన్నారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీతో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా ప్రేక్షకులందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని ధీమాగా చెప్పగలం అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu