HomeTelugu Trendingమరో చిత్రం ప్రకటించిన రవితేజ

మరో చిత్రం ప్రకటించిన రవితేజ

Ravi Teja new movie announc
మాస్‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ ‘క్రాక్’ హిట్‌ కావడంతో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ షూటింగ్ లో ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ తాజాగా మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌, వివేక్‌ కూచిభోట్ల నిర్మించనున్నారు. కుమార్‌ బెజవాడ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu