HomeTelugu Trendingమహేశ్‌ సినిమాలో కన్నడ స్టార్‌!

మహేశ్‌ సినిమాలో కన్నడ స్టార్‌!

Ravichandran in mahesh movi

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన తదుపరి సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ -మహేశ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు. విలన్‌గా తారకరత్న చేయడం దాదాపు ఫిక్స్‌ అయిపోయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ సీనియర్ స్టార్ రవిచంద్రన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్నడలో ఆయనకి క్రేజీ స్టార్ అనే బిరుదు వుంది.

గతంలో ఆయన సినిమాలు తెలుగులోను విడుదలయ్యేవి. అయితే ఈ జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు ఆయన అంతగా తెలియదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్ర మాదిరిగా ఈ సినిమాలో రవిచంద్రన్ కి మంచి రోల్ పడినట్టుగా సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలబెట్టాలని ఉద్దేశంతో ఆ దిశగానే పనులు మొదలెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu