HomeTelugu Trending'రామారావు ఆన్‌ డ్యూటీ'లో వేణు

‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో వేణు

Venu thottempudi in Rama Ra
మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగులో సీనియర్ హీరో వేణు జాయిన్ కానున్నాడు. హీరో వేణు అనగానే ఆయన చేసిన ‘స్వయంవరం’ , ‘చిరునవ్వుతో’ , ‘హనుమాన్ జంక్షన్’, ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలు గుర్తుకు వస్తాయి. తనదైన బాడీ లాంగ్వేజ్ తో డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వేణు కీలకల పాత్రలను కూడా చేశాడు. ఆ తరువాత సినిమాలకు దూరమైన వేణు, మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. షూటింగుకు ఆయనకు వెల్ కమ్ చెబుతూ, ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో వేణు పోషించే పాత్ర గురించి తదితర విషయాలు తెలియాల్సి ఉంది.. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


.

Recent Articles English

Gallery

Recent Articles Telugu