HomeTelugu Trendingరవితేజ 68వ సినిమా షూటింగ్‌ ప్రారంభం!

రవితేజ 68వ సినిమా షూటింగ్‌ ప్రారంభం!

Raviteja 68th movie shootin

మాస్‌ మహారాజ రవితేజ నటించిన ‘ఖిలాడి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజగా ఈ రోజు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రవితేజకు 68వ సినిమా. ఇటీవలే శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ వెంటనే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజున మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఒక పోస్టర్ ను విడుదల చేవారు. రవితేజ ఈ సినిమాను కూడా చాలా వేగంగా పూర్తిచేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్‌గా సందడి చేయనుంది. నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, సురేఖ వాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu