HomeTelugu Trendingసబ్‌ కలెక్టర్‌గా రవితేజ

సబ్‌ కలెక్టర్‌గా రవితేజ

Raviteja as Sub collector i

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఇదే ఆయన తొలి సినిమా. నిన్ననే ఈ సినిమా టైటిల్, రవితేజ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించనున్నాడట. తాజా ఇంటర్వ్యూలో శరత్ మండవ మాట్లాడుతూ, ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. రవితేజ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్రలో రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయట. ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్‌గా నటించనుంది. ‘మజిలీ’ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘ఖిలాడి’ తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu