HomeTelugu Trendingహీరో న్యూలుక్‌.. వైరల్‌

హీరో న్యూలుక్‌.. వైరల్‌

4 22మాస్‌ మహారాజా రవితేజ ఏ పాత్రకైన పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. గత ఏడాది ఆయన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీని తర్వాత రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాల్లూరి నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా కోసం రవితేజ గుర్తుపట్టలేని విధంగా తయారయ్యారు. తాజాగా ఆయన ఫొటో లీక్‌ అయ్యింది. అందులో రవితేజ సన్నగా, యంగ్‌ గెటప్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజను చూసి.. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క రవితేజ హీరోగా ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కనుంది. అజయ్‌ భూపతి దర్శకుడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu