HomeTelugu Trending'RC15'వ టైటిల్‌ ఇదేనా?

‘RC15’వ టైటిల్‌ ఇదేనా?

 

RC15 Titles viral in social

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తరువాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయ్యాడు రామ్ చరణ్. దీంతో చాలా కెర్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో ‘RC 15’వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సమ్మర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ పై ఆసక్తి నెలకొంది.

RC15 Titles 1ఈ మూవీ టైటిల్ ని ఉగాది రోజున రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు టైటిల్స్‌ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సి.ఈ.ఓ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. ఇక దానితో పాటుగా సిఎం (కామన్ మ్యాన్) ఇంకా సిటిజెన్ అనేవి కూడా పరిశీలనలో ఉన్నాయట. అయితే ఇందులో సిటిజెన్ టైటిల్ ఆల్రెడీ అజిత్ తీశాడు.

ఇంతకీ అసలు టైటిల్ ఏంటన్నది తెలియాలంటే మాత్రం ఉగాది వరకు ఎదరు చూడాల్సిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రామ్‌చరణ్‌ తన 16వ సినిమా ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో ఫిక్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలిసిందే.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu