HomeTelugu Trending'rc15' టైటిల్‌,ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడే!

‘rc15’ టైటిల్‌,ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడే!

RC15 update‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌తో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు రామ్‌ చరణ్‌. ఆస్కార్ వేడుకల కోసం ఆయన అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌.. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది.

సునీల్, ఎస్‌.జె.సూర్య, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పై అనేక వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఓ పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ఎలక్షన్ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈక్రమంలో.. పలు ఆస్తికర టైటిల్స్‌ తెరపైకొచ్చాయి. చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్‌‌ అనే అర్థంలో ఈ టైటిల్‌ను పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని భాషలకు ఈ టైటిల్ సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ నెల 22న ఉగాది సంద‌ర్భంగా కానీ.. లేదా 27న రామ్ చరణ్‌ పుట్టిన రోజున కానీ.. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌ని వెల్లడించాలని చిత్ర బృందం భావిస్తోంది. నిర్మాత దిల్ రాజ్ ఓ కార్యక్రమంలో చెప్పారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu