ప్రముఖ వివాహ వేడుకలో మెగా బ్రదర్స్ సందడి

 

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె, నారాయణ్ దాస్ కె నారంగ్ మనుమరాలు, జాన్వీ నారంగ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వరుడు ఆదిత్యతో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. ఈ వివాహ మహోత్సవంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు, పలువురు ప్రముఖులు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, వెంకటేష్, దర్శకుడు హరీష్‌శంకర్, బోయపాటు శ్రీను, అనుదీప్, శేఖర్ కమ్ముల, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, సి. కల్యాణ్, సురేష్‌బాబు, నాగవంశీ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

జాన్వీ నారంగ్ – ఆదిత్య జంట వివాహ వేడుకలో మెగా బ్రదర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక వద్దకు ఇద్దరూ కలిసి వచ్చారు. వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య స్టైలిష్‌లో వీరిద్దరూ పోటీ పడ్డారు. ఇండస్ట్రీ 24 శాఖల నుంచి ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరయ్యారు. హైదరాబాద్ హైటెక్స్ ఈ వేడుక అత్యంత కాస్ట్‌లీ అని భారీ సెట్స్ చెప్తున్నాయంటున్నారు.

 

CLICK HERE!! For the aha Latest Updates