HomeTelugu Trendingరీల్‌లైఫ్‌లో రియల్‌ జగన్‌..!

రీల్‌లైఫ్‌లో రియల్‌ జగన్‌..!

9 13వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ లో జగన్ పాత్ర వుంటుందా? వుండదా? వుంటే కనుక ఈ పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ పాయింట్లకు సమాధానం దొరికేసింది. ఈ బయోపిక్‌లో జగన్ పాత్ర కొద్ది నిమిషాలు మాత్రమే వుంటుంది. ఆ పాత్రలో ఎవరూ నటించడం లేదు. నేరుగా వైఎస్ జగన్ నే కనిపించబోతున్నారు. విషయం ఏమిటంటే, వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా ఆయన పాదయాత్ర పూర్తి చేసుకుని, అధికారం చేపట్టే వరకే వుంటుంది. ఆ తరువాత వైఎస్ మరణం వరకు సినిమా వుంటుంది. కానీ అదేదీ షూట్ చేయరు. పూర్తిగా ఒరిజినల్ ఫుటేజ్ వాడబోతున్నారు.

అంటే చివరి ఇరవై నిమిషాలు పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి వుండగా తీసిన రకరకాల ఫుటేజ్ ను ఎడిట్ చేసి వాడతారన్నమాట. అదే విధంగా వైఎస్ అంతిమ సంస్కారాలు, ఆ టైమ్ లో వైఎస్ జగన్ కనిపించడం అన్నీ కూడా ఒరిజినల్ ఫుటేజ్ నుంచి తీసుకుంటారు. సినిమాలో వైఎస్ జగన్ కనిపించబోతున్నారు అన్నది ఆయన అభిమానులకు, పార్టీ జనాలకు కాస్త ఆసక్తిగానే వుంటుంది. పైగా రియల్ ఫుటేజ్ వల్ల వచ్చే ఎమోషన్ వేరుగా వుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu