సాయి పల్లవి ఆసినిమా అందుకే చేయలేదట!

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం జూలై 26న విడుదలకానున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టిజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. కారణం అందులో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటమే. టీజర్లోనే ఇలా ఉంటే సినిమాలో ఇంకెన్ని సీన్స్ ఉంటాయో అనుకుంటున్నారు ప్రేక్షకులు.

అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారట దర్శక నిర్మాతలు. కానీ లిప్ లాక్ సీన్స్ దండిగా ఉండటంతో సాయి పల్లవి కథ నచ్చినా సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో టీమ్ రష్మిక మందన్నను సంప్రదించారట. ఈ చిత్రమే కాదు గతంలో కొన్ని కథలని లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయనే కారణంగా సాయితో పల్లవి రిజెక్ట్ చేసింది.