HomeTelugu Trendingఆసక్తికరంగా 'మంగళవారం' ఫస్ట్‌లుక్‌

ఆసక్తికరంగా ‘మంగళవారం’ ఫస్ట్‌లుక్‌

ajay bhupathi

‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, A క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది. ఈ సినిమాతో ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ రోజు టైటిల్ మరియు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరోయిన్ ను ఆయన సీతాకోకచిలుక మాదిరిగా చూపించాడు. రెక్కలపై అనేక కళ్ళు చుస్తూ ఉండటం గమనించవచ్చు.

ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఈ సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్.. అని డైరెక్టర్‌ వెల్లడించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్ ను తీసుకున్నట్టుగా టాక్‌. కాంతారా ఫేమ్‌ అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

దర్శకుడు అజయ్‌ భూపతి ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాతో మంచి హిట్‌ని అందుకున్నాడు. ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయి.. వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత ‘మహా సముద్రం’ తెరకెక్కించాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా మణిరత్నం స్టైల్లో ఉందని అన్నారుగానీ, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ తరువాత ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఒక కథను రెడీ చేసుకున్నాడు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu