HomeTelugu Trendingఅమితాబ్‌ ఫొటోను చూడగానే.. రేఖ రియాక్షన్‌.. వీడియో వైరల్‌

అమితాబ్‌ ఫొటోను చూడగానే.. రేఖ రియాక్షన్‌.. వీడియో వైరల్‌

10 23బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ ఫొటోను చూడగానే.. సినీ నటి రేఖ ఇచ్చిన రియాక్షన్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళితే.. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ ఏటా తన క్యాలెండర్‌ కోసం సినీ ప్రముఖులకు సంబంధించిన ఫొటోలు తీస్తుంటారు. ఈ నేపథ్యంలో క్యాలెండర్‌ లాంచ్‌ కార్యక్రమానికి రేఖ హాజరయ్యారు. అక్కడి ఫొటోగ్రాఫర్లకు రేఖ పోజులిస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. ఆమె నిలబడిన చోటే వెనక బిగ్‌బి ఫొటో ఉంది.

ఆ ఫొటో చూడగానే రేఖ అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. దాంతో అక్కడున్న మీడియా వర్గాలు నవ్వుకున్నాయి. ఆ తర్వాత బిగ్‌బి ఫొటోకి దూరంగా నిలబడి ఓ బాలుడిని ముద్దాడుతూ రేఖ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా నెట్లో వైరల్‌గా మారింది. ‘ఈరోజు సోషల్‌మీడియాలో నేను చూసిన బెస్ట్‌ వీడియో ఇదే’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రేఖ ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారేం కాదు. గతంలోనూ ఓ అవార్డు కార్యక్రమానికి రేఖ వెళ్లారు. అక్కడ ఫొటోలకు పోజులివ్వడానికి ఆమె వెళ్లినప్పుడు అమితాబ్ కూడా ఫొటోల కోసం స్టేజ్‌పైకి రావడం చూసి.. ‘అదిగో ఆయన వస్తున్నారు..’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేఖ, అమితాబ్‌ ఎన్నో చిత్రాల్లో జంటగా నటించారు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమలో ఉన్నట్లు గతంలో ఎన్నో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని రేఖ జీవితాధారంగా వచ్చిన ‘రేఖ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ బయోగ్రఫీలోనూ ప్రస్తావించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu