HomeTelugu Trendingమంచు విష్ణు 'భక్త కన్నప్ప'

మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’

4 21
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నిన్న మహా శివరాత్రి సందర్భంగా ఓ ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. అయితే మంచు విష్ణు హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు చెప్పారు. కానీ అది మాములు రెగులర్ సినిమా కాదు అది ఒక పౌరాణిక సినిమా. ఆ చిత్రం ఏమిటంటే ‘భక్త కన్నప్ప’. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక సినిమాకు సంభందించిన ఇతర నటీనటులు సాంకేతిక బృందంకు సంభంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మోహన్ బాబు చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ ‘అహం బ్రహ్మస్మి’ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమ్ముడి మార్గం లోనే అన్నయ వెళ్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు.. కాజల్ హీరోయిన్ గా ‘మోసగాళ్లు’ అనే ఓ సినిమాని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu