ప్రముఖ రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా కన్నుమూత


ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. బుద్ధదేవ్‌ అనేక జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ‘బాగ్‌ బహదూర్‌’, ‘తహదర్‌ కథ’, ‘చరాచార్‌’, ‘ఉత్తర’లాంటి సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు సత్యజిత్ రే వాస్తవిక చిత్రాల నుంచి ఆయన ప్రేరణ పొందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపాన్ని ప్రకటించారు.

‘‘బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా మరణంతో చాలా బాధపడ్డాను. ఆయన వైవిధ్యభరిత రచనలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాలకు అద్ధం పడతాయి. ఆయన గొప్ప తత్వవేత్త, కవి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాప సందేశంలో.. ‘‘ప్రముఖ చిత్రనిర్మాత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా మరణం విచారకరం. ఆయన తన రచనల ద్వారా తన సాహిత్యాన్ని సినీలోకానికి పరిచయం చేశారు. ఆయన మరణం సినీలోకానికి చాలా నష్టం. ఆయన కుటుంబానికి, సహచరులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని’’ అని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates