HomeTelugu Trendingతమన్నా అసిస్టెంట్‌గా వెన్నెల కిశోర్‌..

తమన్నా అసిస్టెంట్‌గా వెన్నెల కిశోర్‌..

Vennela kishore as a assistటాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ సంపత్ నంది డైరెక్షన్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సీటిమార్’. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు గోపిచంద్. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. లాక్‌డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుంది. పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్,బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఒక పాట మిన‌హా ఇప్ప‌టికే నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ పాట‌లు రికార్డ్ చేయ‌డం జ‌రిగిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథానుగుణంగా వెన్నెల కిశోర్ తమన్నాకు అసిస్టెంట్ గా నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో తమన్నా, వెన్నెల కిశోర్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేశాడని, దీనికోసం సంపత్ నంది స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu