రాజ్‌ తరుణ్‌ గృహ ప్రవేశ వేడుకలో సందడి చేసిన అవికా


టాలీవుడ్‌లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ త‌రుణ్‌. తాజగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ముందు వచ్చాడు. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాగా, ఇప్పుడు డిసెంబ‌ర్ 31న థియేట‌ర్‌లోను విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. రాజ్ త‌రుణ్ కొన్నాళ్ళుగా అద్దె ఇంట్లో ఉంటుండ‌గా, ఇప్పుడు ఓ ల‌గ్జ‌రీ హౌస్‌ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్‌గా గృహ ప్ర‌వేశ వేడుక నిర్వ‌హించ‌గా ఈ కార్య‌క్ర‌మానికి బంధువులు, స‌న్నిహితుల‌ని ఆహ్వానించాడు. అయితే ఈ వేడుక‌లో అవికా గోర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. రాజ్‌త‌రుణ్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఫొటోలు దిగింది. నా మొదటి సినిమా నుండి గృహ ప్రవేశం వరకు అన్నింటా తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టాడు రాజ్ త‌రుణ్‌. దీనిపై స్పందించిన అవికా..’రాజ్‌ తరుణ్‌.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. అమి తుమాకో భాలో బాషి(నేను నిన్ను ప్రేమిస్తున్నాను)’ అంటూ నటుడు రాజ్‌ తరుణ్‌ గురించి క్యూట్‌ పోస్ట్‌ పెట్టాంది.

CLICK HERE!! For the aha Latest Updates