HomeTelugu Trendingనెపోటిజంపై రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నెపోటిజంపై రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

2 22
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు మండిపడ్డారు. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా రేణుదేశాయ్ కూడా నెపోటిజంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం కేవలం సినీరంగంలోనే కాదు.. అన్ని రంగాల్లో ఉంటుందని అన్నారు. మనలో టాలెంట్ ఉండి దైర్యంగా నిలబడగలిగితే నెపోటిజాన్ని జయించవచ్చని.. విజయాన్ని సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. సుశాంత్ చాలా సెన్సిటివ్ అనుకుంటాను. తనకు టాలెంట్ ఉంది కాబ‌ట్టి సినిమా రంగంలో సక్సెస్ అయ్యాడని అన్నారు. సుశాంత్ తన ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకోలేక‌పోయాడనుకుంటా అందువల్లే డిప్రెస్ అయ్యాడని భావిస్తున్నా అన్నారు. కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేదా టాలెంట్‌ను న‌మ్ముకుని సినీ రంగంలోకి రాకూడదని, మ‌నోధైర్యం కూడా ఉండాలన్నారు. మ‌న‌ల్ని మ‌నం ఇక్క‌డ ప్రూవ్ చేసుకోవాలంటే చాలా మాన‌సిక ధైర్యం అవ‌స‌రమన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu