HomeTelugu Trending'పెళ్లి సందD'లో ఖుషి కపూర్‌

‘పెళ్లి సందD’లో ఖుషి కపూర్‌

Khushi Kapoor in K.Raghaven
కె.రాఘ‌వేంద్ర‌రావు తెరకెక్కించిన పెళ్లిసందడి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘పెళ్లి సందD’ ప్రకటించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తుండ‌గా, హీరోయిన్ ఎవ‌రు అనేది తెలియాల్సి ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో ఇద్ద‌రు హీరోయిన్‌లను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి క‌పూర్‌ని పెళ్లి సంద‌డిలో హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌. మ‌రో హీరోయిన్‌గా మల‌యాళ బ్యూటీ మాళ‌విక నాయ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాకి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహించనున్నారు. ఆక్రా మీడియా వర్క్స్ సమర్పణలో రాఘవేంద్ర రావు సోదరుడు కె. కృష్ణమోహన్ రావు నిర్మించనున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu