HomeTelugu Big Storiesభయపెడుతున్న ఆర్జీవీ 12 'O' క్లాక్ టీజర్‌..

భయపెడుతున్న ఆర్జీవీ 12 ‘O’ క్లాక్ టీజర్‌..

11 1

కరోనా కాలం లో వరుస సినిమాలను ప్రకటిస్తూ.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. శృంగార తార మియా మాల్కోవా తో ‘క్లైమాక్స్’ , ఆ తర్వాత ‘నగ్నం’ సినిమాలను తెరకెక్కించాడు. ఇక ప్రణయ్ హత్య ఘటన పై ‘మర్డర్’ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు వర్మ. వీటిన ఆర్జీవీ వ‌ర‌ల్డ్ యాప్‌లో ఒక్కొక్క‌టిగా విడుదల చేస్తున్నాడు. ఇక తాజాగా ”12 O క్లాక్” అనే హారర్ మూవీ ప్రకటించాడు. ఒకప్పుడు ‘రాత్’ ‘భూత్’ ‘డర్నా మనా హై’ ‘డర్నా జరూరి హై’ ‘వాస్తుశాస్త్ర’ ‘బూత్ రిటర్న్స్’ వంటి సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టిన వర్మ ఈ మధ్య హారర్ సినిమాలు తీయడం తగ్గించేసాడు. ఇప్పుడు అందరూ కరోనా భయంతో వణికిపోతుంటే నేను హారర్ సినిమాతో భయపెడతాను అంటూ ”12 O క్లాక్” ముందుకొచ్చాడు. ఈ సినిమా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ట్రైలర్ రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు. చెప్పినట్లుగానే ”మీ లాక్డౌన్ అనుభవాన్ని మరింత భయపెట్టడానికి 12 ‘O’ CLOCK అంటూ ట్రైలర్ విడుదల చేశాడు. కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తుండ‌గా, ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌ను అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu