HomeTelugu Trendingబాలయ్యకు నో చెప్పిన సీనియర్‌ నటి!

బాలయ్యకు నో చెప్పిన సీనియర్‌ నటి!

Tabu rejects balakrishna mo

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో ‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో బాలయ్యతో కమర్షియల్ మూవీ ప్లాన్ చేశారు. ఆ సినిమాకోసం దర్శకుడు గోపిచంద్ మలినేని మంచి మాస్ అంశాలతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ‘టబు’ను సంప్రదించాడట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను చేయలేనని చెప్పి ఆమె సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. దాంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైందని అంటున్నారు. గతంలో బాలకృష్ణ జోడీగా టబు చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. అప్పుడు ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సారి ఈ కాంబినేషన్ సెట్ కావడం లేదు. కాగా ఇప్పటికే ఒక హీరోయిన్ గా శ్రుతిహాసన్ .. ఓ కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu