‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ట్రంప్‌తో ప్రమోషన్స్ చేయించిన వర్మ!

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ప్రమోషన్స్ కల్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇన్నాళ్లు సినిమాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని మాత్రమే వాడిన ఆర్జీవీ ఈసారి ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌ను వాడేశారు.

ట్రంప్ వేరొకరితో సంభాషణలో ఉన్న వీడియోను తీసుకుని దాన్ని మార్ఫ్ చేశాడు వర్మ. అందులో ఎదుటి వ్యక్తి లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా ట్రంప్ తప్పక చర్చించాల్సిన విషయం. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటాడు. అవతలి వ్యక్తి వర్మ ఈ సినిమాను రాజకీయం కోసమే తీస్తున్నారా అని అడగ్గా మీరు ఏమైనా అనుకోండి అంటూ ఆఖరున ఏది ఏమైనా సినిమా విడుదలై తీరుతుంది అంటారు. ప్రస్తుతం ఈ మార్ఫింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది.