HomeTelugu Trendingటాలీవుడ్ స్టార్‌ హీరోలపై ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌

టాలీవుడ్ స్టార్‌ హీరోలపై ఆర్జీవీ షాకింగ్‌ కామెంట్స్‌

6 23
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జనసేన అధ్యక్షుడు పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ తోపాటు మరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా వర్మ మాట్లాడుతూ.. నా దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరని.. ఫ్యుచర్ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు. అతడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వెరీ టఫ్ అని యూనిక్ .. వన్ పీస్ అంటూ పొగిడేశాడు. పవన్ ఓన్లీ సింగిల్ పీస్ అంటూ ప్రశంసించాడు. ఇక మెగా స్టార్ చిరంజీవి సినిమాల పరంగా తనకు చాలా ఇష్టమని.. రాజకీయంగా మాత్రం కాదని వర్మ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ బెటర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా స్టార్ హీరోల మీద.. వారి భవిష్యత్ మీద వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువైన వర్మ తాజాగా హీరోల గురించి ఇలా పాజిటివ్ గా స్పందించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu