HomeTelugu Trendingబాలయ్య పాటపై ఆర్జీవీ వెటకారం..

బాలయ్య పాటపై ఆర్జీవీ వెటకారం..

7 9
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నంమూరి బాలకృష్ణ 60 పుట్టిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానుల కోసం స్వయంగా ..ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరునికథ’లోని ఆ పాటను ఘంటసాల నాటి క్లాసిక్ సాంగ్ శివశంకరీ పాట ఆలపించారు. దీనిని నిన్న విడుదల చేశారు.

కాగా బాలయ్య పాడిన ఈ పాటపై రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. ‘వావ్ మహమ్మద్ రఫీ, ఎస్పీబీ కూడా పాడటంలో జూనియర్లే. ఆయన పాడి పాట, ఆ స్వరాల, ఆ శబ్దాలు వింటే శ్రోతల హృదయ స్పందన పెరుగుతుంది. ఒతెల్లో బల్లాడ్ శంకర శాస్త్రి మోజార్ట్‌ల కలయికలా ఉంద’ని ట్వీట్ చేశాడు. తాజాగా వర్మ స్పందిస్తూ.. ‘తన కామెంట్లను కొంతమంది చెడ్డవారు జోక్‌ చేశానని అంటున్నారు కానీ దేవుడు, బాలయ్య మీద ఒట్టేసి చెబుతున్నా.. సంగీతం కనుగొన్నప్పటి నుంచి నేటి వరకు విన్న పాటల్లో ఇదే గొప్ప పాట. నాకు తెలిసి స్వర్గంలోని ఎన్టీఆర్ కూడా సంతోషంతో గంతులు వేస్తుంటారు’ అని మరో సంచలన ట్వీట్ చేశాడు. ఈ ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

7a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu