HomeTelugu Trendingనేను మీకోసం ప్రార్ధించను: ఆర్జీవీ

నేను మీకోసం ప్రార్ధించను: ఆర్జీవీ

RGV tweet about amitabh cor

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే పలవురు సెలబ్రెటీలు ఆయన కోలుకోవాలని ట్విట్ చేశారు. ఇక దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ కూడా తనదైన రీతిలో స్పందించాడు. సర్కార్ నేను మీకోసం కాదు.. కరోనా కోసం ప్రార్ధనలు చేస్తాను అంటూ ట్వీట్ చేశాడు. సర్కార్ మీరు కరోనాను జయిస్తారని మరియు మీరు ఇంతకుముందు కంటే మరింత బలంగా తిరిగి వస్తారని నేను కచ్చితంగా
అనుకుంటున్నాను.. నేను మీ కోసం ప్రార్థించను, మీ చేతిలో చనిపోయే కరోనా కోసం నేను ప్రార్థిస్తాను” అని తెలిపాడు. తాజాగా ఐశ్వర్యరాయ్‌కూ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. అమితాబ్‌తో ‘సర్కార్’ సినిమా తీసి సంచలనం సృష్టించాడు ఆర్జీవీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu