ఆర్కే స్టూడియోస్ సొంతం చేసుకున్న గోద్రెజ్ సంస్థ

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 70 సంవత్సరాల క్రితం.. 2.2 ఎకరాల్లో నిర్మితమైన ఆర్కే స్టూడియోస్ ను ఇప్పుడు గోద్రెజ్ ప్రాపెర్టీస్ సంస్థ రూ.190 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి కపూర్ ఈ స్టుడియోస్ ను నిర్మించారు. ఈ స్టూడియోస్ బ్యానర్లో ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 వంటి సినిమాలు నిర్మితమయ్యాయి. రిషి కపూర్ మరణించిన తరువాత ఈ స్టూడియోస్ ను రిషి కపూర్ ఫ్యామిలీ మెంబర్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. గత కొంతకాలంగా ఈ స్టూడియోను సినిమా షూటింగ్ ల కోసం ఉపయోగించడంలేదు.

దీంతో ఈ స్టూడియోని అమ్మేయాలని రిషి కపూర్ ఫ్యామిలీ నిర్ణయించింది. ఈ స్టూడియోస్ ను హస్తగతం చేసుకోవడానికి చాలా సంస్థలు పోటీపడినా చివరకు.. గోద్రెజ్ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చింది హస్తగతం చేసుకున్నది.