ఎన్టీఆర్‌-అఖిల్‌పై ఆర్జీవీ ట్వీట్‌.. వైరల్‌


వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉంటాడు. ఎప్పుడూ వివాదాస్పద, వ్యంగ్య కామెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా మరోసారి తనదైన శైలిలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అఖిల్‌పై సంచలన ట్వీట్ చేశాడు. ఆ ఈవెంట్లో స్టేజీ వద్ద ఫ్రంట్ లైన్ లో తారక్ – అఖిల్ పక్కపక్కనే కూచుని ఉన్నారు. తారక్ ఏదో మాట్లాడుతూ అఖిల్ తొడ భాగంపై ఒక్క గిల్లు గిల్లాడు. దానికి అఖిల్ ఎంతో సిగ్గు పడిపోతున్నాడు.

ఈ ఫన్నీ వీడియోను తాజాగా ఇన్ స్టాలో షేర్ చేశారు ఆర్జీవీ. దీనికి తనదైన శైలిలో రొమాంటిక్ ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ‘ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే’ … అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్‌ వేశారు. శాడ్ నెస్ ఈమోజీల్ని ఆశ్చర్యం వ్యక్తపరిచే ఈమోజీల్ని షేర్ చేశాడు. ఈ ట్వీట్‌పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఫాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా ” అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates