HomeTelugu Trendingలాలూ బయోపిక్‌.. 'లాల్‌టెన్‌'

లాలూ బయోపిక్‌.. ‘లాల్‌టెన్‌’

5 25బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో బయోపిక్ సినిమాలు వరసగా వస్తున్నాయి. రాజకీయ, సిని, స్పోర్ట్స్ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ ను బేస్ చేసుకొని సినిమాలు తీస్తున్నారు. కాగా, బీహార్ కు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన లాలూప్రసాద్ యాదవ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో లాలూప్రసాద్ యాదవ్ పాత్రలో భోజపురి నటుడు యశ్ కుమార్ నటిస్తున్నారు. అలానే రబ్రీదేవి పాత్రలో స్ముతి సిన్హా నటిస్తోంది. ఈ సినిమాకు లాల్ టెన్ అనే పేరు పెట్టారు. లాల్ టెన్ అంటే లాంతరు అని అర్ధం. ఆర్జేడీ పార్టీ సింబల్ కూడా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కాబోతున్నది. వచ్చే ఏడాది బీహార్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu