HomeTelugu Trendingప్లే బ్యాక్‌ ట్రైలర్‌

ప్లే బ్యాక్‌ ట్రైలర్‌

PlayBack Trailer
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్లే బ్యాక్’. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించింది. డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి ‘1 నేనొక్కడినే’ సినిమాకి కథ అందించిన హరి ప్రసాద్ జక్కా ఈ చిత్రానికి డైరెక్షన్‌ వహించారు. గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో మే 21 నుంచి ”ప్లే బ్యాక్” మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు సూర్య, అర్జున్ కళ్యాణ్ , స్పందన కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని ‘ప్లే బ్యాక్’ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu