HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ సినిమాలో విలన్‌గా రోజా!

అల్లు అర్జున్‌ సినిమాలో విలన్‌గా రోజా!

7 2

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే రోజాను సంప్రదించడం, పాత్ర నచ్చి సినిమాలో నటించటంతో.. రోజా ఒప్పుకోవడం జరిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఆ మధ్యన బోయపాటి, బాలయ్య సినిమాలో రోజా నటించబోతున్నట్లు వార్తలు వచ్చినా.. దర్శకుడు వాటిని ఖండించారు.

పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రోజా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్.. ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐదు భాషల్లో పుష్ప సినిమా విడుదల కానుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ ఈసినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పుష్ప పోస్టర్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu