HomeTelugu TrendingRRR విడుదల తేదీ వచ్చేసింది

RRR విడుదల తేదీ వచ్చేసింది

RRR movie release 7th janua

రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌- మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి బిగ్‌ బ్రేకింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పటికి ఎన్నోసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌ నెలకొంది. ప్రేక్షకులంతా ఈ మూవీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుస్తూన్న తరుణంలో తాజాగా డైరెక్టర్‌ రాజమౌళి ఈ సస్పెన్స్‌కు తెర దింపాడు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అలియాల కొత్త లుక్‌ను పరిచయం చేస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది 2022 జనవరి 7వ తేదీన మూవీ విడుదల చేయబోతున్న ట్విటర్‌లో వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu