అవసరాల కోసం నన్ను వాడుకున్నారు: పవన్

నటుడు, జనసేన రాజకీయ పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. నిన్నటి నుండి పవన్ ఏ విషయాల గురించి మాట్లాడనుకుంటున్నారో.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈరోజు ఉదయం జనసేన కార్యాలయంలో జరిగిన ఈ
కార్యక్రమంలో పవన్ కల్యాణ్.. టీడీపీ, బిజేపీ పార్టీలపై ఎన్నో విమర్శలు చేశారు.

ఆ రెండు పార్టీలకు నేను మద్దతు పలికినప్పుడు నీకు రాజకీయ గురించి ఏం తెలుసని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. అదే నేను ప్రజా సమస్యలపై ఉద్యమించే సరికి నీకు రాజకీయాల గురించి ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రాజకీయాల గురించి నేర్చుకొని రా అంటున్నారు.

వారి అవసరాల నిమిత్తం నన్ను ఆంధరప్రదేశ్, తెలంగాణ, కర్నాటక మొత్తం తిప్పించారు. అవసరాల కోసం నన్ను వాడుకున్నప్పుడు రాజకీయ పరిజ్ఞానంతో పనిలేదు..ఇంతకంటే అవకాశ రాజకీయం మరొకటి ఉంటుందా..? అంటూ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు.