పవన్ డైరెక్టర్ తో బన్నీ!

ఈ మధ్యకాలంలో వరుస విజయలను తన ఖాతాలో వేసుకుంటున్న అల్లు అర్జున్ త్వరలోనే
‘దువ్వాడ జగన్నాథం’గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో
ఆయన చారి తరహా పాత్ర్హలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే
బన్నీ కోసం కొత్త కథలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వక్కంతమ్ వంశీ, బన్నీకు కథ
చెప్పినట్లు సమాచారం. అలానే విక్రమ్ కె.కుమార్ తోను ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
ఇప్పుడు మరో డైరెక్టర్ బన్నీను దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేసుకున్నాడు. పవర్ సినిమాతో
టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమయిన బాబీ ఆ సినిమా తరువాత ఏకంగా పవన్ కల్యాణ్ ను
డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
రీసెంట్ గా బన్నీను కలిసి కథ కూడా వినిపించినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ ఎప్పుడు
పట్టాలెక్కుతుందో త్వరలోనే తెలియనుంది.

CLICK HERE!! For the aha Latest Updates