బాలయ్య కావాలనే చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. అందరూ స్నేహపూర్వకంగా ఉంటూనే.. సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఓ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే అదే రోజున రావాలనుకునే సినిమా వాయిదా వేసుకొని తరువాత రోజు వస్తున్నాయి. ఇదొక ఆరోగ్యకరమైన వాతావరణమనే చెప్పాలి. కానీ ఇప్పుడు చిరు, బాలయ్యల తంతు మాత్రం అలా లేదు. నిజాలు మాట్లాడుకుంటే.. ఖైదీ నెంబర్ 150 సినిమా మొదలు పెట్టినప్పుడే సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు. కానీ మధ్యలో ‘శాతకర్ణి’ కూడా వస్తున్నామని చెప్పింది.

రెండు పెద్ద సినిమాలు ఒకే పండుగకు రావడం మంచి విషయమే అయినా.. సినిమాల రిజల్ట్ ను బట్టి సోషల్ మీడియాలో అభిమానుల ట్రోలింగ్ తప్పదు. ఇప్పటికే కావాలని ఒక వర్గం వారు చిరు సినిమా గురించి నెగెటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. విజయవాడలో ఫంక్షన్ చేయడానికి పర్మిషన్ కూడా దొరకాకుండా చేశారు. అప్పటికీ చిరు టీం అవేమీ పట్టించుకోకుండా.. ఫంక్షన్ ను గుంటూరుకి షిఫ్ట్ చేశారు. రిలీజ్ డేట్ కూడా ‘శాతకర్ణి’ కంటే ఒక రోజు ముందుగానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనికి పోటీ అన్నట్లు బాలయ్య అండ్ కో.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను అంత గ్రాండ్ గా చేసుకున్నప్పటికీ మళ్ళీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు రెడీ అయిపోతున్నారు.

బాలయ్య సన్నిహితులు కావాలనే సినిమాను సంక్రాంతికి రిలీజ్ కావాలని పట్టుబట్టారట. లేకపోతే క్రిష్ ఈ సినిమాను మార్చి, లేదా ఏప్రిల్ రిలీజ్ చేయాలనుకున్నాడు. తొందర పెట్టడం వలన గ్రాఫిక్స్ వర్క్ కూడా సరిగ్గా రాలేదని ఫిల్మ్ నగర్ టాక్. ఇదంతా చిరుపై కావాలని పోటీగా దిగడానికి చేస్తున్నట్లే ఉంది. గతంలో ఇలా పోటీకి దిగిన సంధార్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం విజయం సాధించింది చిరు సినిమాలే.. మరి ఈసారి ఏమవుతుందో.. చూడాలి!