HomeTelugu Trendingసారీ బ్రదర్‌... ఆయనకి పంపించాను

సారీ బ్రదర్‌… ఆయనకి పంపించాను

1 25
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అయితే శుక్రవారం రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తానని ఎన్టీఆర్‌ చెప్పారు. దీంతో అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌.. ‘సారీ బ్రదర్‌ రామ్‌చరణ్‌.. రాజమౌళి అభిప్రాయం తెలుసుకుందామని నీ గిఫ్ట్‌ను నేను గత రాత్రి ఆయనకి పంపించాను. రాజమౌళి దగ్గరికి వెళ్తే అది ఎంత ఆలస్యంగా వస్తుందో నీకు తెలుసు కదా.. చిన్న ఆలస్యం’ అని ట్వీట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన రామ్‌చరణ్‌.. ‘ఏంటి ఆయనకి పంపించావా.. ఈరోజుకి వస్తుందా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు.

మరోవైపు సర్‌ప్రైజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి ట్విటర్‌ వేదికగా రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘ఐ యామ్‌ వెయిటింగ్‌.. భీమ్‌ ఫర్‌ రామ్‌రాజు’ అని ట్వీట్‌ చేశారు. చిరు ట్వీట్‌పై స్పందించిన రాజమౌళి.. ‘సార్‌.. అంటే.. అది.. కొంచెం.. కొంచమే.. వాస్తవంగా.. ప్లీజ్‌.. సార్‌’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం భీమ్‌ ఫర్‌ రామరాజు అనే ట్యాగ్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu