HomeTelugu Trendingసమంత ఆరోగ్యంపై మరోసారి వార్తలు వైరల్‌

సమంత ఆరోగ్యంపై మరోసారి వార్తలు వైరల్‌

Rumors about samantha healt

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆరోగ్యంపై మరోసారి పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్న సమంత ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో సమంత హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే, సమంతకు ఏమీ కాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సమంత ఆసుపత్రిలో చేరిందనే వార్తలు పుకార్లే అని కొట్టిపారేశారు.

ఆమె ఇంటి వద్దనే క్షేమంగా ఉందని సమంత మేనేజర్ కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu