HomeTelugu Trendingమానవ స్పర్శ తెలియని ఆఘోరగా విశ్వక్‌సేన్‌

మానవ స్పర్శ తెలియని ఆఘోరగా విశ్వక్‌సేన్‌

Characters of Vishwak Sen G

టాలీవుడ్ న‌టుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ అఘోరగా కనిపిస్తున్నాడు. క్రౌడ్‌ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు‌. చాందిని చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజర్‌ను విడుద‌ల చేశారు.

ఈ టీజర్‌ని చూస్తుంటే.. ఇది కూడా ఒక ఫిక్షనల్‌ స్టోరీలానే అనిపిస్తుంది. ఇటీవలే ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. కార్తికేయ, విరూపాక్ష, ఊరు పేరు భైరవకోన పలు సినిమాలు ఈ కోవకు చెందినవే. ఈ సినిమాలకు మంచి టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘గామి’ టీజర్‌ చూస్తుంటే.. ఇది సస్పెన్స్‌‌, థ్రిలర్‌లా అనిపిస్తుంది.

మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్‌ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం అంటూ తెలిపింది. ఈ సినిమా మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలీ, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, శరత్ కుమార్ తదిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలు గా సరైన హిట్ లేని విశ్వక్‌కు ఈ సినిమా అయినా సక్సెస్‌ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu