‘సాహో’ ఫస్ట్ సింగిల్ టీజర్ వచ్చేసింది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’ ఫస్ట్ సింగిల్ టీజర్ వచ్చేసింది. కొద్దిసేపటికి క్రితమే ఈ టీజర్‌ను విడుదల చేశారు. అల్ట్రా ఎలెక్ట్రిక్ మ్యూజిక్ తో అదిరిపోయింది. జస్ట్ 28 సెకన్ల నిడివికలిగిన ఈ సాంగ్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. జులై 8 వ తేదీన ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రోజుకొక్కటి చొప్పున విడుదల చేసేందుకు మూవీయూనిట్‌ రెడీ అయ్యింది. పోస్టర్లు, ఫోటోలు, సింగిల్స్ టీజర్, సింగిల్స్ ను వరసగా విడుదల చేస్తారట. ఆడియో, ప్రీ రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలోనే ప్రకటించనున్నారు.