‘ఎఫ్ 2’ దర్శకుడు ‘అనిల్ రావిపూడి’ అరెస్ట్ !

దర్శకుడు అనిల్ రావిపూడి పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఎఫ్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. టికెట్ కొని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకుల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఇతని కామెడీ ట్రీట్ కోసం ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ సినిమాకు వస్తున్నారు. ఇంతలా ప్రేక్షకుల్ని నవ్వించేస్తున్నందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసింది ఎవరో కాదు ఆ సినిమాలో హీరో వరుణ్ తేజ్. షూటింగ్ సమయంలో సరదాగా తీసుకున్న ఒక ఫోటోను షేర్ చేసిన వరుణ్ అతిగా నవ్విస్తున్నందుకు అరెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు.