సెన్సార్‌ పూర్తి చేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’


మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌, ట్రైలర్‌లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద పాజిటివ్ బజ్‌ క్రియేట్ అయ్యింది.

ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికేట్ దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్‌ కొట్టాలని భావిస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును కూడా సాయి తేజ్‌ మార్చుకున్నాడు. మరి ఈ ప్రయోగం అయిన సాయి తేజ్‌కు హిట్‌ ఇస్తుందేమో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates