తగించినకున్న సాయి ధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత సినిమాల్ని ప్రేక్షకులు రిజక్ట్ చేయడానికి గల కారణాల్లో ఆయన లుక్ కూడా ఉంది. బాగా బరువు పెరిగి ఎటు నుండి చూసిన ఒకేలా కనిపించిన తేజ్ లుక్ మెగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. దాదాపు నాలుగు సినిమాల్లో ఇలానే కనబడ్డాడు తేజ్. చివరికి ప్రేక్షకుల తిరస్కరణకు కారణం తెలుసుకుని బరువు తగ్గించాడు. కొంచెం సన్నబడి అయన చేసిన ‘చిత్రలహరి’ మంచి విజయాన్నే ఇచ్చింది. దీంతో తరవాతి సినిమా కోసం ఇంకా సన్నబడ్డాడు. ప్రజెంట్ చాలా సన్నగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే తేజ్ తన తర్వాతి సినిమాను మారుతి డైరెక్షన్లో చేస్తున్నాడు.