HomeTelugu Trendingవిరాటపర్వం` నుంచి `సోల్‌ ఆఫ్‌ వెన్నెల` రిలీజ్‌..

విరాటపర్వం` నుంచి `సోల్‌ ఆఫ్‌ వెన్నెల` రిలీజ్‌..

Soul of Vennela from Virata Parvam is stunning

1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, నక్సలైట్‌ నాయకుడు రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవి, తమకు, పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ సినిమాలపై అంచనాలను పెంచాయి. జులై 1న ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది.

ఇవాళ హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లి ఒడిలో ఒకసారి.. ఆశయాన్ని ఆయుధం చేసినట్టు అతని ప్రేమలో మరొకసారి’ అంటూ ఇందులో సాయి పల్లవి పాత్ర స్వభావం గురించి వివరించారు.ఈ స్పెషల్‌ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది..

Recent Articles English

Gallery

Recent Articles Telugu