తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సాయి పల్లవి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి ప‌ల్లవి. త‌న అందం, అభిన‌యంతో యూత్‌లో వీపరితమైన క్రేజ్‌ తెచ్చుకుంది. ఆక‌ట్టుకుంటూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాలతో పాటు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు రెడీగా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా సాయి పల్లవి తన తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరినీ ఫిదా చేసింది. నీలిరంగు పట్టు చీరలో అందంగా, ముద్దుగా మెరిసిపోతుంది.

తాతయ్య, అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఫోజులిస్తూ దిగిన ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ… అమితమైన సంతోషం కనిపిస్తోంది. ‘మూలాలు(రూట్స్‌).. తాత 85వ పుట్టినరోజు’ అంటూ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడయాలో వైరల్‌గా మారాయి. దీనిపై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తున్నారు. నటి రాశీఖన్నా ‘బ్యూటీ’ అంటూ కామెంట్‌ చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates