HomeTelugu Trendingగీతా ఆర్ట్స్‌తో మహేష్‌బాబు

గీతా ఆర్ట్స్‌తో మహేష్‌బాబు

1 18

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు సినిమా చేస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లోనే సినిమా ఉంటుందని .. మహేష్ బాబు సతీమణి నమ్రత గీతా ఆర్ట్స్ తో చర్చలు జరిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ తో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యి లాభాల్లో వాటా తీసుకోవాలని మహేష్ ను కోరారట.

కానీ, మహేష్ బాబు మాత్రం దానికి ససేమిరా అనడంతో సినిమా పోస్ట్ ఫోన్ అయ్యింది. ఆ తరువాత ఇప్పుడు మరలా మరోసారి మహేష్ సినిమా తెరమీదకు వచ్చింది. ఈ విషయాన్ని బన్నీ వాసు ఇటీవలే కన్ఫర్మ్ చేశారు. బన్నీ వాసు ఇటీవలే ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా గురించి చెప్పారు. మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ లో సినిమా ఉంటుందని వచ్చే ఏడాది కన్ఫర్మ్ అవుతుందని అన్నారు. అయితే, దర్శకుడు ఎవరు ఏంటి అనే విషయాలు త్వరలోనే వెలువడబోతున్నాయి. మహేష్ 27 వ సినిమా వంశీపైడిపల్లితో చేస్తున్నాడు. మహేష్ 28 గీతా ఆర్ట్స్ లో ఉండొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu