HomeTelugu Trendingవిరాటపర్వం నుండి ఉగాది స్పెషల్‌ పోస్టర్‌

విరాటపర్వం నుండి ఉగాది స్పెషల్‌ పోస్టర్‌

Sai pallavi Festive Look fr

టాలీవుడ్‌ యువ నటుడు దగ్గుబాటి రానా- సాయిపల్లవి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘రివల్యూషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, టీజర్, ‘కోలు కోలు’ పాట విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఉగాది కానుకగా సాయి పల్లవికి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్‌ లో సాయి పల్లవి లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో వెన్నెల అనే యువతి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. కాగా దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu