HomeTelugu Trendingఅల్లు అర్జున్ మూవీలో సాయి పల్లవి!

అల్లు అర్జున్ మూవీలో సాయి పల్లవి!

Pushpa movie

అల్లు అర్జున్, సుకుమార్‌‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజాచిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి కాబట్టి మళ్లీ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ నెల 8నుంచి మారేడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేయబోతున్నారట. త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసమే చిరంజీవి ఆచార్య మూవీలో అవకాశం వచ్చినా తిరస్కరించిందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu